ఖమ్మంలో విచిత్ర దొంగ

ఖమ్మంలో విచిత్ర దొంగ
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Khammam Thief : ఇప్పటి వరకు మనం ఎన్నో దొంగతనాలను చూసి ఉంటాం. డబ్బు, నగలు, వాహనాలు ఇలా విలువైన వస్తువులు ఏమున్నా దొంగలు దోచుకుని వెళతారు.

Khammam Thief : ఇప్పటి వరకు మనం ఎన్నో దొంగతనాలను చూసి ఉంటాం. డబ్బు, నగలు, వాహనాలు ఇలా విలువైన వస్తువులు ఏమున్నా దొంగలు దోచుకుని వెళతారు. కానీ ఓ దొంగ మాత్రం విచిత్రంగా రెండు లక్షల రూపాయల ఆభరణాలను వదిలేసి కేవలం 2000వేల రూపాయలను మాత్రమే దొంగిలించాడు. అబ్బ ఈ దొంగ ఎంత మంచివాడో అనుకుంటున్నారు కదా. అసలు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందో, ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ దొంగ రాత్రి పూట అందరూ పడుకుని ఉన్న సమయంలో కష్టపడి కిటికీకి ఉన్న జాలి కత్తిరించాడు. ఆ తరువాత గోడకు తగిలించి ఉన్న ఓ సంచిని కర్ర సాయంతో కొట్టేసాడు. ఆ బ్యాగులో ఉన్న రెండు వేల నగదును తీసుకున్నాడు.

కానీ అదే బ్యాగులో ఉన్న రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరనాన్ని బ్యాగులోనే వదిలేసి బ్యాగును మొక్కలను పెంచే కుండీలో వేసి వెళ్లాడు. అంతే కాదు గోడ మీద ఓ రాతను కూడా రాసాడు. అదేంటంటే 'నాకు డబ్బులు అత్యవసరం కావడంతో బ్యాగులో నుంచి రూ.2 వేలు తీసుకున్నా. మీ బంగారం బ్యాగులోనే ఉంది.. బ్యాగును కుండీలో వదిలేసి వెళ్తున్నా.. నన్ను క్షమించండి' అని రాసి వెళ్లిపోయాడు. అబ్బ నిజంగా ఈ దొంగ మంచి దొంగ అనిపిస్తుంది కదా. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో రిటైర్డ్‌ ఉద్యోగి బాబ్జీ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారి కుటుంబ సభ్యులు నిద్రలేచిన కుటుంబ సభ్యులు కిటికీ వైపు చూసారు. జాలీ కత్తిరించి ఉండడాన్ని, గోడకున్న బ్యాగ్ లేకపోవడాన్ని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కంగారుగా ఇంటి బయటకొచ్చి చూడగా కిటికీ పక్కన గోడపై దొంగ రాసిన రాతలు కనిపించాయి. అది చదివిన కుటుంబ సభ్యులు వెంటనే మొక్కలున్న కుండీ వైపు చూసి బ్యాగ్ ను తీసుకున్నారు. ఓపెన్ చేసి చూడగా పుస్తెల తాడు అందులోనే భద్రంగా ఉంది. ఆ ఆనందంలోనే, ఆ షాకులోనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కూడా ఆశ్చర్యపోయారు.




Show Full Article
Print Article
Next Story
More Stories