Sweets Shop Owner dies of Corona in Hyderabad: నిశ్చితార్థానికి 300 మంది.. ప్రముఖ స్వీట్ల వ్యాపారి మృతి..

Sweets Shop Owner dies of Corona in Hyderabad: నిశ్చితార్థానికి 300 మంది.. ప్రముఖ స్వీట్ల వ్యాపారి మృతి..
x
Sweets Shop Owner dies of Corona in Hyderabad
Highlights

Sweets Shop Owner dies of Corona in Hyderabad: కరోనా విస్తరిస్తున్న వేళ పుట్టిన రోజు, పెండ్లి వేడుకలకు వెళ్లి ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

Sweets Shop Owner dies of Corona in Hyderabad: కరోనా విస్తరిస్తున్న వేళ పుట్టిన రోజు, పెండ్లి వేడుకలకు వెళ్లి ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. వారిలో కొంత మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇదే తరహాలో నగరంలోని ప్రముఖ స్వీట్స్ షాపు ఫ్రాంచైజీ యజమాని కూడా గురువారం రాత్రి కరోనాకు బలయ్యారు. ఈ విషయం తెలియగానే ప్రముఖ వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. గత నెలలో అబిడ్స్‌లోని ఓ హోటల్ లో జరిగిన ఎంగేజ్‌మెంట్ పార్టీకి 70 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న వ్యాపారి హాజరయ్యారు. ఆయనతో పాటు మరో 300 మంది కూడా ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు.

కరోనా నిబంధనలను పాటించకుండా నిర్వహించిన ఈ పార్టీలో ఎవరూ కూడా మాస్కులు ధరించలేదని, అదే విధంగా సామాజిక దూరం కూడా పాటించలేదని సమాచారం. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న వారు గత రెండు వారాల్లో మరిన్ని పెళ్లిళ్లు, పుట్టిన రోజులకు హాజరయ్యారు. దీంతో ఈ నిశ్చితార్థానికి హాజరైన వారిలో వంద మందికిపైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారని సమాచారం. కాగా వీరిలో చాలా మంది బాధితులు ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది మాత్రం స్వయంగా చికిత్స చేసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పాతబస్తీకి చెందిన ఓ జ్యువెలరీ షాపు యజమాని గురువారం మరణించారు. ఇక కరోనాతో మరణించి వ్యక్తికి నగరంలో మొత్తం 9 ప్రాంతాల్లో స్వీట్ షాపులున్నాయి. వీరు మొదట గుల్జార్ హౌస్ వద్ద స్వీట్ షాపును తెరిచింది. తర్వాత బంజారాహిల్స్ మసాబ్ ట్యాంక్ రోడ్‌లో మరో స్వీట్ షాప్ తెరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories