ASI dies of Corona in Hyderabad: కరోనా టెస్టులో నెగటివ్.. సిటీ స్కాన్‌లో పాజిటివ్..

ASI dies of Corona in Hyderabad: కరోనా టెస్టులో నెగటివ్.. సిటీ స్కాన్‌లో పాజిటివ్..
x
Banjara Hills ASI dies of Corona Whose Initial Report Suggests Corona Negatvie
Highlights

ASI dies of Corona in Hyderabad: గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త కొత్తగా రూపాంతరం చెందుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన మొదట్లో బాధితుల్లో వైరస్ లక్షణాలు కనిపించేంది.

ASI dies of Corona in Hyderabad: గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త కొత్తగా రూపాంతరం చెందుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన మొదట్లో బాధితుల్లో వైరస్ లక్షణాలు కనిపించేంది. కానీ ఇప్పుడు వైరస్ వ్యాపించినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వారికి వైరస్ సోకిన విషయం కూడా తెలియకుండానే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మరికొంత మందికి ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టులు చేస్తే రిపోర్టుల్లో నెగిటివ్ అని వస్తుంది. అదే సిటీస్కాన్ చేస్తే మాత్రం పాజిటివ్ అని తేలుతోంది. కానీ అప్పటికే బాధితులు తమ ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది.

ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే చోటు చేసున్నాయి. అయితే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో వైద్యులు విస్మయానికి గురువుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే... నగరంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో గత మూడేళ్లుగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆయన రేయింబవళ్ళు సేవలందించారు. కాగా ఆయన ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ రిపోర్టులో నెగెటివ్‌ అని తేలింది. దీంతో ఆయన తనకు కరోనా సోకలేదని భావించి ఎర్రగడ్డలోని ఓ హాస్పిటల్‌లో చేరారు.

ఆ తరువాత అక్కడి వైద్యులు ఆయనకు సిటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఇన్ఫెక్షన్‌ కరోనా వల్లే ఉండొచ్చని భావించిన వైద్యులు ఆయనను వెంటనే కోవిడ్‌ ఆస్పత్రుల్లో చేరాలని సూచించగా మళ్లీ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి వెళ్ళారు. కానీ అక్కడి వైద్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇక్కడ నెగెటివ్‌ వచ్చిన వారికి ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, ఆక్సిజన్‌ అందించే ఏర్పాట్లు లేవని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. ఆయన అక్కడ చేరిన కొద్ది సేపటికే ఆస్పత్రిలో ఆక్సీజన్ లేక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. చూసిన కుటుంబు సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కాగా అక్కడ ఆస్పత్రి సిబ్బంది తమ వద్ద భద్రతాకార్డుపై చికిత్స అందించే సౌకర్యంలేదని చేతులెత్తేశాయి. ఆ తరువాత ఉన్నతాధికారుల చొరవతో సోమవారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో బెడ్‌ కోసం ప్రయత్నించగా సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బెడ్‌ దొరికింది. దీంతొ వైద్యులు అతనికి మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories