రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌..

రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌..
x
Highlights

తెలంగాణలో బాణసంచా వ్యాపారులకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో బానా సంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది

తెలంగాణలో బాణసంచా వ్యాపారులకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో బానా సంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది.. పర్యావరణ హితమైన టపాసులు కాల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు నిషేధం పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టలో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories