Summer Heat Alert: భగభగ మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్

Summer Heat Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి ఉండనుంది.

Dhivi
Published on: 16 March 2025 8:00 AM IST
Summer Heat Alert: భగభగ మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్
X

 Summer Heat Alert: భగభగ మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్

Summer Heat Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి ఉండనుంది. వీకెండ్ టూర్లు, ప్రయాణం చేసేవారికి నేడు ఎండతో ఎంతో ఇబ్బంది ఉండనుంది. కొంత గాలులు వీస్తుంటాయి. కర్నాటక, తెలంగాణ, రాయలసీమలో శనివారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శాటిలైట్ అంచనాల ప్రకారం..భూమధ్య రేఖా ప్రాంతంలో దట్టంగా మేఘాలు ఉన్నాయి. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో మేఘాలు అంతగా లేవు. అందుకే నేడు ఏపీ,తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుంది. అయితే సోమవారం మాత్రం మేఘాలు వచ్చే అవకాశం ఉంది.

ఇక పలు చోట్లు సాధరణ ఉష్ణోగ్రత కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కి అవుతున్నారు. గాలిలో తేమ పడిపోవడంతో ఎండ పెరగడానికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వివరించింది. రానున్న రెండు రోజుల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరం అనుకుంటే తప్ప..బయటకు రావద్దని ఒకవేళా వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

తెలంగాణలోని కొన్ని జిల్లాలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఛాన్స్ ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో 41నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందంటూ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, కామారెడ్డి, ములుగు, జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Dhivi

Dhivi

Next Story