ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
x
Highlights

తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు, ఐసీయూ చికిత్స విభాగం, పలు విభాగాలకు వెళ్లి రోగులతో మాట్లాడటం జరిగింది.

జహీరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు, ఐసీయూ చికిత్స విభాగం, పలు విభాగాలకు వెళ్లి రోగులతో మాట్లాడటం జరిగింది. వారికి అందుతున్న చికిత్స వివరాల గురించి రోగులకు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారికి ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందజేయాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు మందులు బయట నుండి తెచ్చుకోవాలని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారని, తనకు ఫిర్యాదులు వసుతున్నాయని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వైద్యులకు, సిబ్బంది కి ఆదేశించారు.

అంబులెన్స్ లను ఎల్లపుడూ అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రజలు ఆసుపత్రికి వైద్యం గురించి వచ్చినపుడు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో వైద్యులు ఆసుపత్రిలో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో గౌరవ ముఖ్యమంత్రి పేద ప్రజలకు మంచి వైద్యం అందజేయాలని, అనేక పథకాలు కొనసాగిస్తున్నట్లుగా తెలియజేసారు. వైద్య సేవలు, పథకాలు ప్రజలకు అందేలా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories