Rains In Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

Rains In Hyderabad: పలుచోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం * నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Sandeep Eggoju
Updated on: 3 May 2021 5:30 PM IST
Rains In Hyderabad: Sudden Rains in Hyderabad Continues For 2 Days | Weather Report Today
X

హైదరాబాద్ లో వర్షం 

Rains In Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో అటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. జూబ్లీహిల్స్, కోఠి, లక్డీకాపుల్, కూకట్ పల్లి, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

దీని ప్రభావంతో రెండురోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story