‌Hyderabad: సెల్ఫీ దిగుతూ వాగులో జారిపడ్డ విద్యార్థి

Hyderabad: హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్ వాగు దగ్గర ఘటన

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 7:00 PM IST
Student Slips Into a River While Taking a Selfie in Hyderabad
X

Representational Image

‌Hyderabad: సెల్ఫీ మోజుతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిథిలోని పెద్ద అంబర్‌పేట్ వాగులో విద్యార్థి ప్రణీత్ సెల్ఫీ తీసుకుంటూ జారి పడ్డాడు. మన్నెగూడకి చెందిన ప్రణీత్ తమ స్నేహితులతో కలిసి పెద్ద అంబర్ పేట్ దగ్గర ఉన్న వాగు దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలో ఫొటోలు దిగుతుండగా ప్రమాద వశాత్తు జారి వాగులో పడిపోయాడు. విషయాన్ని గమనించిన ప్రణీత్ స్నేహితులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసులు గాలింపు చేపట్టే సమయానికే ప్రణీత్ మృతి చెందడంతో.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story