Municipal Elections: స్టాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన కమిషనర్: నరసయ్య


పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
దుబ్బాక: పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. సిఐ హరికృష్ణ, ఎస్ఐ స్వామి లను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్నా, ముందు జాగ్రత్త చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన భద్రత గురించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గాను పోలీస్ అధికారులు చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలపై ఎన్నికల నిర్వహణలో భాగంగా, సంబంధిత అధికారులు దుబ్బాక పట్టణంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, ఎన్ని పోలింగ్ బూతులు, పోలింగ్ స్టేషన్ల రూట్లతో పాటు మొదలైన వివరాలను తెలిసి ఉండాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలలో, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావలసిన సౌకర్యాలను, మున్సిపల్ అధికారుల సమన్వయంతో కలసి ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతీ ఒక్క పోలీస్ అధికారి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని. ఎలక్షన్ కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా లేక ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్, సీసీ కెమెరా ఫుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులందరూ చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ బూత్ లను ఎల్లపుడు సందర్శిస్తూ, అక్కడి స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలి.
శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినం గా వ్యవహరించాలని తెలిపారు, వాహనాలు తనిఖీ చేసేటప్పుడు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అందరూ అప్రమత్తంగా ఉండాలని, శాసనసభ, లోకసభ, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కేసులు నమోదైన వ్యక్తులను బైండోవర్ చెయ్యని సూచించారు. నాన్-బెయిలబుల్ వారెంట్ త్వరలో ఎగ్జిక్యూట్ చేయాలని తెలిపినారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణములోని వార్డులలో బెల్ట్ బెల్టుషాపులపై రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని, ఎన్నికల నేపథ్యంలో రూట్ మొబైల్స్, మరియు ట్రబుల్ మంగర్స్, పాత నేరస్తుల గురించి మరియు గత ఎన్నికలలో నేరాలు చేసిన వ్యక్తుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు.
ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, డబ్బు పంపిణీ చేసే ఇతర వస్తువుల పై నిఘా ఉంచాలని అధికారులు సిబ్బంది సందర్శించినప్పుడు ప్రజలకు పై వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని. మరియు అధికారులు సిబ్బంది ఇన్ ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. వార్డు పోలీస్ అధికారులు వార్డు ప్రజలతో వార్డు ప్రజాప్రతినిధులతో ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఏ చిన్న సంఘటన జరిగినా ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను ఒక వార్డులో కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైన నందున 19 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించబడును.
పోలింగ్ కేంద్రాలు 39, పోలింగ్ లొకేషన్లు 15 కలవు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ (ఎం. సి.సి)-01, ఫ్లయింగ్ స్క్వాడ్ (ఎఫ్.ఎస్.టి)-01, స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్ (ఎస్. ఎస్.టి)-02, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వి.ఎస్.టి)-01., నార్మల్-39 పోలింగ్ కేంద్రాలు. ఈరోజు వరకు గత ఎన్నికల్లో కేసులు నమోదైన మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని మున్సిపల్ ఎన్నికల పరిధిలో ఉన్న వారిని (63) మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు.మరియు లచ్చ పేట మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి తగు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నరసయ్య కు సూచించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గార్డ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



