అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం : సీపీ

హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కమిషనర్...
హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కమిషనర్ అంజనీకుమార్. ఏడేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు.. అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం జరుగుతుందన్నారు. అల్లర్లు సృష్టించే వాతావరణం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు సీపీ. ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం అని సీపీ హెచ్చరించారు.
Hyd city is in election mode. All leaders are working hard to win the hearts and votes of community. Election is the temple of democracy. But during such times there are some evil minds who are working to create communal issues though social media. Don not believe them. Inform us pic.twitter.com/qMGW5itd1O
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) November 26, 2020