Hyderabad: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్‌ల కలకలం.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటోన్న యువత

Hyderabad: చిన్న పాటి గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 7:39 AM IST
Street Fighting Increasing in Hyderabad Old City
X

Hyderabad: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్‌ల కలకలం.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటోన్న యువత

Hyderabad: చిన్న పాటి గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి. స్నేహితులైనా ఎవరైనా ఆ క్షణికావేశంలో ఏం చేస్తున్నారనే విచక్షణ కోల్పోయి దాడులు చేసుకుంటున్నారు యువకులు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా నగరంలో ఏదో ఓ చోట వెలుగుచూస్తోన్న గ్రూపు గొడవలు, హత్యోదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

హైదరాబాద్‌‌లో స్ట్రీట్‌ఫైట్స్ కలవరపెడుతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేంతలా తెగిస్తున్నారు యువకులు. చిన్న వయసులోనే పగలు, ద్వేషాలతో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఈ స్ట్రీ‌ట్‌ఫైట్స్‌ కల్చర్‌ పాతబస్తీలోనే అధికంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌లోనూ ఇలాంటి ఘటనలు ఆగలేదు. ఇటీవల డబీర్‌పుర ఏరియాలో ఓ చిన్న గొడవతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కమ్రాన్‌, అద్నాన్‌ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ కాస్త రెండు గ్రూపుల మధ్య దాడికి దారి తీసింది. కమ్రాన్ తన గ్యాంగ్‌తో అద్నాన్‌పై దాడి చేయడంతో తీవ్రగాయాలపాలై అద్నాన్ మరణించాడు.

ఇక ఈ దాడిలో పాల్గొన్న వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఇలా చిన్న వయసులోనే యువత నేరాలకు పాల్పడుతుండటం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇలా వరుసగా పాతబస్తీలో ఏదో ఓ చోట హత్యా ఘటనలు వెలుగుచూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో పోలీసుల నిఘా వైఫల్యం కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా పోలీసులు కఠినంగా వ్యవహరించి నిఘా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story