Delhi: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దుండగుల రాళ్ల దాడి

Delhi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.

Arun Chilukuri
Updated on: 14 Aug 2023 6:00 PM IST
Stones Pelted at Asaduddin Owaisi’s Delhi House
X

Delhi: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దుండగుల రాళ్ల దాడి

Delhi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై అసద్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఓ వైపు ముస్లింల ఇండ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే.. మరో వైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని మండిపడ్డారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందానని, కొన్ని రోజులుగా తన ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారని ఆరోపించారు. రాళ్ల దాడి గురించి నాకు భయం లేదు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే సామాన్యుడి సంగతేంటి? ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే పెద్ద గొడవ అయ్యేది. దేశానికి ఇలాంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు అని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story