రాష్ట్ర ప్రభుత్వం రోహింగ్యాలు ఉన్నారని నివేదిక పంపింది : కిషన్‌రెడ్డి

X
Highlights
హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వమే...
Arun Chilukuri26 Nov 2020 10:58 AM GMT
హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక రూపంలో పంపిందని ఆయన వెల్లడించారు. రోహింగ్యాలపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమస్యలను వదిలేసి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనమని కిషన్ రెడ్డి అన్నారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
Web TitleState government has sent a report on Rohingyas in Hyderabad: Kishan Reddy
Next Story