గ్రేటర్ ఫైట్ లో స్టార్ కాంపెయినర్లు

గ్రేటర్ ఫైట్ లో స్టార్ కాంపెయినర్లు
x
Highlights

గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను...

గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన పార్టీలకు ఐదు నుంచి పది మందికి, రిజర్వ్ సింబల్ లేని రిజిస్టర్ పార్టీలకు ఇప్పటి వరకు ఇద్దరికి అవకాశం ఉండగా ప్రస్తుతం ఐదుగురు స్టార్ క్యాంపెయినర్లచే ప్రచారం చేసుకోవచ్చని ఈసీ అనుమతిచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి.

తెలంగాణ రాష్ర్ట సమితి తరపున సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీష్ రావు, మహామ్మద్ అలీ, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.

బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్‌, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories