Hyderabad: బోరబండ శ్రీనివాస్ కు నిమ్స్‌లో పరీక్షలు

Hyderabad: మత్తుమందు ఇచ్చి అవయవాలు తీసుకుని ఉంటారని కుటుంబీకుల అనుమానం

Rama Rao
Published on: 6 April 2022 11:38 AM IST
Srinivas Health Condition was Examined By NIMS Doctors
X

Hyderabad: బోరబండ శ్రీనివాస్ కు నిమ్స్‌లో పరీక్షలు

Hyderabad: బోరబండ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ డాక్టర్లు పరీక్షించారు. శరీరంలో అవయవాలు బాగానే ఉన్నాయని బాధిత కుటుంబీకులకు వివరించారు. టెంపో డ్రైవర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్లి తిరిగొచ్చిన తర్వాత శరీరం, తల భాగంపై కుట్లను గుర్తించిన కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. శరీంలోని కీలకమైన అవయవాలను తీసుకుని కుట్లువేసి ఉంటారని అనుమానించారు. శరీరం, తలపై కుట్లగాయాలతో నిమ్స్ లో చేర్పించారు. శ్రీనివాస్ శరీర భాగంలో అవయవాలు బాగానే ఉన్నాయని నిమ్స్ ఆసుపత్రి సిటీ స్కాన్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.

శ్రీనివాస్ కు ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంగా గోవాలో శస్త్రచికిత్స చేసి కుట్లు వేసి ఉంటారని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నారు. శ్రీనివాస్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్న నిమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకుంటేగానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story