Sircilla: మహిళల ఆర్థిక ఎదుగుదలకు శ్రీనిధి తోడ్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపెళ్లి గ్రామంలో, మహిళా గ్రామైక్య సంఘాలు సమావేశానికి శ్రీనిధి బ్యాంక్ రీజినల్ మేనేజర్ విజయ్ కుమార్ హాజరయ్యారు.

S. Srikanth
Published on: 11 March 2020 12:51 PM IST
Sircilla: మహిళల ఆర్థిక ఎదుగుదలకు శ్రీనిధి తోడ్పాటు
X

రాజన్న సిరిసిల్ల: జిల్లా బోయినపల్లి మండలం అనంతపెళ్లి గ్రామంలో, మహిళా గ్రామైక్య సంఘాలు సమావేశానికి శ్రీనిధి బ్యాంక్ రీజినల్ మేనేజర్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళల ఆర్థిక పెరుగుదలకు స్త్రీనిధి బ్యాంకు తోడ్పాటు అందిస్తుందని, మహిళా వ్యాపార రంగాలలో ప్రోత్సాహం ఇచ్చి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఇవ్వడం కోసం, స్త్రీ నిధి పథకం కింద రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

స్త్రీ నిధి కింద రుణాలు పొందిన మహిళలు యూనిట్లు నెలకొల్పాలని సూచించారు. అంతేకాక ఇతర బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. శ్రీనిధి పథకం కింద రుణాలు తీసుకుని, పూర్తిగా చెల్లించిన అనంతరం, తీసుకున్న వడ్డీ తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సౌజన్య, వివో ఏ వివో అధ్యక్షురాలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story