Sputnik V: హైదరాబాద్‌కు చేరుకున్న రష్యా టీకా స్పుత్నిక్‌-వి

Sputnik V vaccines from Russia Arrive in Hyderabad
x

Sputnik V: హైదరాబాద్‌కు చేరుకున్న రష్యా టీకా స్పుత్నిక్‌-వి

Highlights

Sputnik V: రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి డోసులు స్పెషట్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

Sputnik V: రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి డోసులు స్పెషట్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 1.52 లక్షల డోసులు తొలి విడతలో భారత్‌కు చేరుకోనున్నట్లు ఇటీవలే రష్యాలోని భారత రాయబారి తెలిపారు. నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావడం మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్పుత్నిక్‌-వి టీకాలు భారత్‌ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్‌-వికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చేపట్టింది.

ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన స్పుత్నిక్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌, అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌ 12న పచ్చజెండా ఊపింది.



Show Full Article
Print Article
Next Story
More Stories