Singer Harini: సింగర్ హరిణి తండ్రి ఎకే రావు కేసులో దర్యాప్తు ముమ్మరం

Singer Harini: బెంగుళూరులో ఎకే రావు మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

Sandeep Eggoju
Published on: 26 Nov 2021 1:07 PM IST
Speedup the Singer Harini Father AK Rao Death Case
X

సింగర్ హరిణి తండ్రి ఏకె రావు (ఫైల్ ఇమేజ్)

Singer Harini: సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హత్యా కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి యాలంక రైల్వే పోలీసులతో పాటు బెంగుళూరు రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్ లిస్ట్, సీసీపుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది.

ఈనెల 8న హైదరాబాద్ నుండి బెంగుళురు వెళ్లినట్లు గుర్తించారు. ఆపై 23న రైల్వే ట్రాక్‌పై కత్తి గాయాలతో ఏకేరావు శవమై తేలాడు. ఈ క్రమంలో ఏకేరావు హైదరాబాద్ నుండి ఎవరితో కలిసి వెళ్లారు?. ఎందుకు వెళ్లారు? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అవసరం అయితే హైదరాబాద్ పోలీసుల సహకారం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులను బెంగుళూరు పోలీసులు విచారించారు. పాత కక్షలు, ఆస్థివివాదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story