Covid Vaccination Drive: హైదరాబాద్‌లో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్

Covid Vaccination: * అందరికీ వ్యాక్సిన్‌ అనే లక్ష‌్యంతో మొబైల్ వ్యాక్సినేషన్ * జీహెచ్ఎంసీ పరిధిలో 175 వాహనాల ఏర్పాటు

Arun Chilukuri
Updated on: 29 Aug 2021 12:09 PM IST
Special Vaccination Drive in Hyderabad  Almost 70 Percent Vaccination Completed In Greater Hyderabad
X

హైదరాబాద్‌లో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్

Covid Vaccination Drive: హైదరాబాద్‌లో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికీ వాక్సిన్ అందించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. కాలనీలు, బస్తీలు, ప్రధాన సెంటర్లు వేటిని వదలకుండా మొబైల్ వాక్సినేషన్ వాహనాలను పంపిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు లు ఉమ్మడిగా ఈ వాక్సిన్ ఉద్యమం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 4వేల 8వందల 46 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్ లోని 360 వాడలు, కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే 70 శాతంకు పైగా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక మొబైల్ వాక్సిన్ వాహనాలను సిద్ధం చేశారు. కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తానికి హైదరాబాద్‌లో త్వరలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story