బస్తీ వాసులను రెండుగా చీల్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లు!

బస్తీ వాసులను రెండుగా చీల్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లు!
x
Highlights

తెలంగాణ ప్రభత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం రెండువర్గాల బస్తీవాసుల మధ్య చిచ్చు రేపింది. హైదరాబాద్ లోని మోహదీపట్నం బోజగుట్ట వాసుల...

తెలంగాణ ప్రభత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం రెండువర్గాల బస్తీవాసుల మధ్య చిచ్చు రేపింది. హైదరాబాద్ లోని మోహదీపట్నం బోజగుట్ట వాసుల సొంతింటి కళ, కళగానే మిగిలి పోయింది. ఐదు ఎళ్ళు గడుస్తున్న ఇక్కడి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులకు నోచుకోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకన్ని మొట్టమొదటిసారిగా ఎంచుకున్న ప్రాంతం మోహదీపట్నంలోని భోజగుట్ట. ఇక బోజగుట్టలో ప్రకాశ్ నగర్, వివేకనందనగర్, శివాజీ నగర్ లను కలిపి దాదాపు 13 ఎకరాల స్థలంలో 1824 ఇళ్ళను మంజురు చేస్తామని హామి ఇచ్చారు అధికారులు. ఏండ్లు గడుస్తున్నా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రస్తవనా లేక పోవడంతో బస్తీ వాసులు అదోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భోజగుట్టలో డబుల్ బెడ్ రూమ్ లను కట్టిస్తామని చెప్పడంతో అక్కడి బస్తీవాసులు 50 శాతం ఖాలీ చేసిన మిగితా వారు అక్కడే ఉండిపోయారు. ఖాళీ చేసిన ప్రాంతంలో ఇళ్ళ నిర్మణం చేపట్టిన అధికారులు అధి పూర్తి చేయకుండా గాలికి వదిలేసారు. ఎడాదిలో పూర్తి చేస్తామని చేప్పడంతో ఇళ్ళు ఖాలీ చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. అధికారులపై నమ్మకంతో తాము ఉంటున్న ఇళ్ళు ఖాలీ చేసి కిరాయికి ఉంటున్నమాని ఇప్పుడు ఇంటి అద్దేలు చెల్లించ లేక పస్తులు ఉండాల్సి వస్తుందంటు కన్నిటి పర్యాంతమవుతున్నారు, పైసా తీసుకోకుండా పేదలకు విశాలమైన డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని చెప్పి మహదీపట్నం బోజగుట్టలో 300 మంది ఇళ్లు, గుడిసెలు కూల్చేసారు. దాని స్థానంలో సంవత్సరంలోపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఖాళీ చేయించి ఐదు సంవత్సరాలవుతోంది. ఐనా, ఇంత వరకు డబుల్ బెడ్రూం లు నిర్మించలేదని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. ప్రభుత్వం నిధుల కొరతతోనే ఇళ్ళ నిర్మాణం ఆపింది. ఇళ్ళు కొల్పోయి గుట్టపైన తాత్కాలికంగా గుడిసెలు వేసుకొన్న తమకు ఎప్పుడు ఎం జరుగుతుందో అని భయం భయంగా జీవిస్తున్నట్లు బస్తీవాసులు తెలిపారు.

ప్రభుత్వం దాదాపు 160 కోట్ల నిధులు మంజూరు చేసింది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో 2018 జనవరిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. చాలామందిని తమ గుడిసెలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలుగా బోజగుట్ట పైకి పంపించారు. దాదాపు 300 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికి అవి నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఇళ్ళ నిర్మాణం సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలైన పూర్తికాకపోవడం, అధికారులు స్థానిక కార్పోరేటర్ కూడా స్పందించకపోవడంతో ఈ ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో అని ప్రశ్నార్థకంగా మారింది.

భోజగుట్టలో ఇళ్ళు నిర్మాణం పేరుతో తమ ఇల్లు కూల్చి గుట్ట పైకి పంపిచారని ఐదు సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు నిర్మాణాలు పూర్తవలేదని, తాము తాత్కాలికంగా గుడిసెల్లో ఉంటున్నామని ఎప్పుడు ఎం జురగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక్కొక్క చిన్న గుడిసెలో 10 మందికి పైగా నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైన ఎమైన ప్రమాదం జరిగినప్పుడు ఆంబులెన్స్ రావాడానికి కూడా మార్గాలు లేవని బస్తీవాసులు చెబుతున్నారు.

ఇక తాజా పరిణామాలు అయితే భోజగుట్ట ప్రాంతం ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకునే పరిస్థితి ఎర్సడింది. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ సథకం తీసుకురావడంతో కొంతమంది ఖాలీ చేసి వెల్లిపోయారు. మరికొందరు అక్కడే ఉండి పోయారు. దీంతో ఇళ్ల నిర్మణం పనులు సగంలో ఓదిలేయండం అందుకు కారణం నిదులు అని చెబుతునే మరో కారణం ఇతర భస్తీవాసులు కాళీ చేయకపోవండం అని కొందరు అధికారులు చెప్పడంతో, ఇప్పుడు వారి మధ్య వర్గపోరు మొదలైంది. మేము కాలీ చేసం మీరు చేస్తే పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని ఇరు వార్గాల వారు వాదనలకు దిగుతు దాడులు సైతం చేసుకుంటున్నారు. ఒకే కుంటుంబంలా ఉండే తమ మధ్య వివాదం మొదలైందని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖాళీ చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుగా డబుల్ బెడ్రూం లు కట్టించి వారికిస్తే, తర్వాత ఆలోచిస్తామని బస్తీవాసులు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ఓ దారి చూపలని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories