Top
logo

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు స్పీకర్ పోచారం చురకలు

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు స్పీకర్ పోచారం చురకలు
X
Highlights

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు స్పీకర్ పోచారం చురకలు అంటించారు. సభలో మంత్రులు ఈటెల-జగదీష్ రెడ్డి...

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు స్పీకర్ పోచారం చురకలు అంటించారు. సభలో మంత్రులు ఈటెల-జగదీష్ రెడ్డి కోవిడ్ రూల్స్ పాటించలేదు. సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో-సీటింగ్ ఛైర్ లో మంత్రి జగదీష్ రెడ్డి కూర్చున్నారు. మంత్రులను గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్ లో కూర్చోవద్దన్న కోరారు. స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటెల దగ్గర నుంచి మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లిపోయారు. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు. అలాగే అసెంబ్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పీచ్ కు మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ సమాధానం కోసం ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు నిరంజన్ రెడ్డి. స్పీకర్ కు సమయాన్ని గుర్తుచేశారు మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి, ఒక్క ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించిన మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి . మంత్రులు అడ్డుచెప్పడంతో ఒక్క నిమిషం అంటూ స్పీచ్ ముగించేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.Web Titlespeaker Pocharam Srinivas reddy fires on Ministers
Next Story