Adilabad: సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాలుకు రూ.4,600 మద్దతు ధర

Adilabad: తొలి పంటను తీసుకువచ్చిన రైతుకు సన్మానం

Shekhar G
Published on: 25 Feb 2024 4:16 PM IST
Soybean Procurement Begins in Adilabad
X

Adilabad: సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాలుకు రూ.4,600 మద్దతు ధర 

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోళ్ల ను జిల్లా సహకార సంఘం అధికారి మోహన్ ప్రారంభించారు. ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత, మార్కెట్ యార్డుకు తొలి పంటను తీసుకువచ్చిన రైతును సన్మానించి కొనుగోళ్ళను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధికారి మోహన్ మాట్లాడుతూ సోయాబీన్ క్వింటాలుకు 4 వేల,600 రూపాయలను మద్దతు ధర నిర్ణయించినట్టు తెలిపారు. 12 శాతం వరకూ తేమ ఉంటేనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story