Rains in Telangana 2021: కేరళలో రుతుపవనాలు...తెలంగాణలో వర్షాలు

Rains in Telangana 2021: రుతుపవనాలు కేరళను తాకాయి దీంతో తెలంగాణ లో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది

Kranthi
Updated on: 3 Jun 2021 9:04 AM IST
Southwest Monsoon Entered Kerala and Rains Expected in Many Places of Telangana
X

Rains in Telangana: (File Image)  

Rains in Telangana 2021: వచ్చేస్తున్నాయ్.. వచ్చేశాయ్.. చల్లటి గాలులతో రివ్వున వచ్చేస్తున్నాయ్ రుతుపవనాలు. గురువారం కేరళలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆ ఎఫెక్టుతోనే హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గురువారం, శుక్రవారం కూడా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

రుతుపవనాలు మన రాష్ట్రంలోకి వచ్చేవారం రానున్నాయ్. వాతావరణశాఖ అంచనాల ప్రకారం.. ఈ సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదు కానున్నది. బుధవారం ఆరుట్ల (రంగారెడ్డి జిల్లా)లో 4.5 సెంటీమీటర్లు, గచ్చిబౌలి (హైదరాబాద్)లో 4.5, ఎర్రారం (నల్గొండ జిల్లా)లో 4.4, దండుమైలారం (రంగారెడ్డి)లో 3.8, మాదాపూర్ (హైదరాబాద్) లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Kranthi

Kranthi

Next Story