హైదరాబాద్‌ చైతన్యపురిలో SOT పోలీసుల దాడులు.. కోటి రూపాయల మందులు సీజ్‌

Hyderabad: డ్రగ్‌ ఇండియా పేరుతో గోదాంలో లేబుల్‌ లేని మెడిసిన్స్

Dhatripriya
Published on: 15 Jun 2023 3:18 PM IST
SOT Police Raids In Chaitanyapuri  Hyderabad
X

హైదరాబాద్‌ చైతన్యపురిలో SOT పోలీసుల దాడులు.. కోటి రూపాయల మందులు సీజ్‌

Hyderabad: హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఎల్‌బీనగర్‌లో ఎస్‌వోటి పోలీసులు దాడులు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ముడి సరుకు తెప్పించి వాటిని ప్యాకింగ్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. కాలంచెల్లిన మందులు గోడౌన్స్‌లో నిల్వ చేసి పలు మెడికల్ షాపులకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగా ఉన్న స్టాక్‌ను స్పెషల్ ఆపరేషన్ టీం సీజ్ చేసింది. డ్రగ్ ఇండియా మహావీర్ పేరుతో గోదాంలో లేబుల్ లేని మందులు, డేట్ ఎక్స్పై రీ మందులు స్టోర్ చేశారు. యజమాని ఉమేష్ బాబు లాల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story