Hyderabad: పని ఒత్తిడి.. కోకాపేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం

Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్గింగి పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Oct 2024 11:53 AM IST
Software Engineer Commits Suicide In Hyderabad
X

Hyderabad: పని ఒత్తిడి.. కోకాపేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం

Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్గింగి పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఇంజినీర్ ప్రభాకర్ సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏపీకి చెందిన ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

కోకాపేటలోని హాస్టల్ గదికి వచ్చి బిల్డింగ్ పైనుంచి దూకి ప్రభాకర్ సూసైడ్‌కి పాల్పడ్డారు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story