Durgam Cheruvu: దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Software Employee Commits Suicide By Jumping Into Durgam Cheruvu
x

Durgam Cheruvu: దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Highlights

Durgam Cheruvu: హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Durgam Cheruvu: హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ ఈనెల 24న ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.. దీంతో కుటుంబసభ్యులు 25న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీది నుంచి కిందికి దిగినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలను పోలీసులు సేకరించారు. అయితే దుర్గం చెరువులో గాలించగా బాలాజీ మృతదేహం లభ్యమైంది. ప్రేమవ్యవహారం వల్లే బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories