Top
logo

మెట్రో రైల్లో పాము.. ఐదు రోజులకి దొరికింది!

మెట్రో రైల్లో పాము.. ఐదు రోజులకి దొరికింది!
X
Highlights

హైదరాబాద్ మెట్రో రైల్లో పాము ప్రవేశించింది. డ్రైవర్ కాబిన్ లో పాము కనిపించడంతో రైలును నిలిపివేశారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ వారు ఐదు రోజులు ప్రయత్నించి పామును పట్టుకున్నారు.

హై సెక్యూరిటీ.. తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అయినా సరే ఆ పాము ఎలా దూరిందో ఏమో ఏకంగా మెట్రో రైలు లోకి దూరింది. ఈనెల 14న మెట్రో రైలులో డ్రైవర్ క్యాబిన్ లో పాము కనిపించింది. ట్రైన్ రన్నింగ్ లో ఉంది. ఒకవేళ విషయం ప్రయాణీకులకు తెలిస్తే ఆందోళన చెందుతారు. అందుకే ట్రైన్ ఆగిన తరువాత ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీని పిలిపించారు. వారు పాము కోసం ప్రయత్నించారు. ఎంత వెతికినా అది దొరకలేదు. దాంతో ఆ ట్రైన్ ను నిలిపేశారు. మళ్ళీ దానిని తీద్దామని ప్రయత్నిస్తే.. సోమవారం డ్రైవర్ క్యాబిన్ లో ప్రత్యక్షం అయింది. దీంతో తిరిగి ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీని పిలిపించారు. ఐదు రోజుల పాటు అందులోనే బస చేసిన పామును స్నేక్‌ సొసైటీ పట్టుకోగలిగింది.

స్నేక్‌ సొసైటీ వారు ఇన్ని రోజులుగా పాము ఇంజిన్‌ కు చుట్టుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకనే 5రోజులుగా వెతుకుతున్నా కనిపించలేదని తెలిపారు. దాదాపు మెట్రో ట్రైన్‌లోకి పాములు దూరడం అసాధ్యం. నగర పౌరులు కంగారుపడాల్సిన అవసర్లేదు. ఇటువంటి పాములు ఎత్తుగా ఉండే ప్రదేశాలకు ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తాయి. బహుశా ఏదైనా చెట్టు ఎక్కు అందులో నుంచి ట్రైన్‌లోకి చొరబడి ఉండొచ్చని భావిస్తున్నారు.


Next Story