Mangapet: కోళ్ల పెంపకందారులను ఆదుకోవాలి: జిల్లాఅధ్యక్షుడు కుమారస్వామి

వెంకటాపూర్ గ్రామానికి చెందిన మిల్కురి ఐలయ్యకు చెందిన పౌల్ట్రీ ఫామ్ లో వైరస్ ప్రభావం వలన సుమారుగా 6వేల కోళ్లు మరణించాయి.

S. Srikanth
Published on: 27 Feb 2020 5:50 PM IST
Mangapet: కోళ్ల పెంపకందారులను ఆదుకోవాలి: జిల్లాఅధ్యక్షుడు కుమారస్వామి
X

మంగపేట: వెంకటాపూర్ గ్రామానికి చెందిన మిల్కురి ఐలయ్యకు చెందిన పౌల్ట్రీ ఫామ్ లో వైరస్ ప్రభావం వలన సుమారుగా 6వేల కోళ్లు మరణించాయి. ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కోళ్ల ఫామ్ ను సందర్శించారు.

కుమారస్వామి మాట్లాడుతూ కోళ్ల పెంపకం వృత్తిగా భావించి పనిచేస్తున్న రైతులకు వైరస్ వలన తీవ్ర నష్టం వచ్చిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన కోళ్ల ఫామ్ రైతులకు నష్టపరిహారం కింద 5 లక్షలు అందించి చేయూతను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సిద్ధం రాజయ్య , వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story