డ్రోన్ కెమెరాలతో నిఘా : కొత్తగా అమల్లోకి తెచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్..

డ్రోన్ కెమెరాలతో నిఘా : కొత్తగా అమల్లోకి తెచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్..
x
Highlights

కోవిద్-19 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించేందుకు, శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రోన్ కెమెరాలతో నిఘా ప్రారంభించారు.

కోవిద్-19 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించేందుకు, శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రోన్ కెమెరాలతో నిఘా ప్రారంభించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో జిల్లా మొత్తం లో డ్రోన్స్ కెమెరాల నిఘా నిర్వహించనున్నారు. ఎయిర్ సెర్వు ఇన్నిటిటివేస్, పాలదీన్ డ్రోన్స్ సహాయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టడం జరిగింది...ఇది మనదేశంలోనే మొదటిసారిగా జిల్లాలో వినియోగిస్తున్నారు.

దీని కోసం ( సి&సి ) సెంట్రల్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ ను జిల్లా కార్యాలయంలో లో ఏర్పాటు చేసి జిల్లా లో ఉన్న ప్రతి పెట్రో కార్స్ లో ఒక డ్రోన్ కెమెరా ను మరియు ఒక డ్రోన్ ఆపరేటర్ ను అమర్చనున్నారు. ప్రతి పెట్రో కార్స్ ఆఫీసర్స్ కి పెట్రో కార్స్ మరియు డ్రోన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది..

అదేవిధంగా థర్మల్ డ్రోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెట్రో కార్ మరియు బ్లూ కోర్ట్ సిబ్బంది ఏ ఏ ప్రాంతాలకు వెళ్లడం కష్టతరం అవుతుందో ఆ ఆ ప్రాంతాలపై డ్రోన్స్ తో నిగా పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా అన్ని డ్రోన్స్ విజువల్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ లో చూడవచ్చు..

ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రోన్స్ యొక్క లొకేషన్ రావడం జరుగుతుంది. వేరేప్రదేశం లోని డ్రోన్స్ ని నుండి కూడా ఆపరేట్ చేయడం వీలవుతుంది. ఏది మొదటి సరిగా ప్రయోగించడం జరిగింది. ఇది జరిగినా తర్వాత, డయల్ -100 పొలిసు కంట్రోల్ రూమ్ కు అటాచ్ చేయడం జరుగుతుంది. డయల్- 100 కు ఎమర్జెన్సీ కాల్ రాగానే, తక్షణమే డ్రోన్ ద్వారా స్పందించి, వెళ్లి విజువల్స్ తీసుకునేలా చేయడం జరుగుతుంది.

ఈ డ్రోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ & మెషిన్ లెర్నింగ్. ఈ డ్రోన్లు సమూహాలను పర్యవేక్షించడానికి, వస్తువులను గుర్తించడానికి, సంఘటనలను గుర్తించడానికి మరియు ఆపరేటర్లను హెచ్చరించడానికి సహాయపడతాయి. పైలట్ ప్రాజెక్ట్ రాజన్న సిరిసిల్ల పోలీసు విభాగం యెక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది...

ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు వచ్చి పేకాట ఆడిన, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన బహిరంగా ప్రదేశల్లో మద్యపాన చేసిన ఈ డ్రోన్ కెమెరాతో గురించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేసి, ఎక్కడైతే ప్రజలు అనవసరంగా బయట తిరుగుతున్నారో వాళ్లని అదుపులోకి తీసుకొని రోడ్డు మీద అనవసరంగా ఉంటున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పని లేకుండా రోడ్లపై మోటార్ సైకిళ్లపై తిరిగే వ్యక్తులపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, పోలీసుల సూచనలు సలహాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
Next Story
More Stories