సింగరేణిలో కరోనా భయం

సింగరేణిలో కరోనా భయం
x
Highlights

సింగరేణి కార్మికులకు కరోనా భయం పట్టుకుంది. మంచిర్యాల జిల్లాలో కేసులు పెరగటం బెల్లంపల్లిలో ఓ కార్మికుడికి కరోనా రావటంతో ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం...

సింగరేణి కార్మికులకు కరోనా భయం పట్టుకుంది. మంచిర్యాల జిల్లాలో కేసులు పెరగటం బెల్లంపల్లిలో ఓ కార్మికుడికి కరోనా రావటంతో ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి భద్రత కల్పించటం లేదంటున్నారు. ప్రతీ కార్మికుడికి మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీ చేయాలని కోరుతున్నారు.

మంచిర్యాల జిల్లా సింగరేణి కోటపై కరోనా రక్కసి దండయాత్ర మొదలైంది. గనులపై మహమ్మారి కన్నేయటంతో కార్మికులు ప్రాణ భయంతో వణుకుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో శాంతి గనిలో పనిచేస్తున్న ఓ సింగరేణి కార్మికుడు ఇటీవల కరోనా బారిన పడ్డాడు. దాంతో కరోనా గుబులు కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 50 కరోనా కేసులు నమోదవటం వర్షాకాలం సీజన్ వస్తుండటంతో వ్యాధి విస్తరిస్తుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో మందమర్రి,శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి డివిజన్లు ఉన్నాయి. ఈ మూడు డివిజన్లలో సుమారు23 వేలకు పైగా కార్మికులు గనులలో పని చేస్తున్నారు. వీరంతా మొత్తం మూడు షిఫ్టులలో పనిచేస్తారు. ఇలా సామూహికంగా పనులకు హజరయ్యే సందర్భంలో కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆందోళన చెందుతున్నారు కార్మికులు.

గనుల దగ్గర పనిచేసే కార్మికులకు కొద్దిపాటి చర్యలు తీసుకుంటుండగా కార్మికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్ల కొరతపై యాజమాన్యంతో మాట్లాడుతామన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories