Palamuru University: పాలమూరు యూనివర్సిటిలో ప్రొఫెసర్ల కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
Palamuru University: 35 మంది ప్రొఫెసర్లు ఉండాలి కాని అందుబాటులో 21 మంది ప్రొఫెసర్లు
Palamuru University: పాలమూరు యూనివర్సిటిలో ప్రొఫెసర్ల కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
Palamuru University: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నత విద్యకు ఏకైక పెద్దదిక్కుగా ఉన్న పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రాఫెసర్ల కొరత వేధిస్తోంది. బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో కీలకమైన భూమిక పోషించే ప్రాఫెసర్ల నియామకాలు లేక పదేళ్లు అవుతోంది. ఇటు ఉన్న కొంత మంది అధ్యాపకులు కూడా ఉద్యోగ విరమణ పొందడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుతం పీయూలోని అన్ని విభాగాల్లో కలిపి 35 మంది ఆచార్యులకు గాను 21 మందే అందుబాటులో ఉన్నారు. ప్రాఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఎన్నో ఎళ్ళుగా కొనసాగుతున్నా పాలకులను నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదని విద్యార్థుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 2008లో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, అయిదుగురు సహాయ ప్రొఫెసర్లతో ప్రారంభించారు. సహ ఆచార్యులు సీఏఎస్ అంటే కెరీర్ అడ్వాన్స్ డ్ స్కీం కింద ఆచార్యులుగా పదోన్నతి పొందారు. ఇక 2013లో అప్పటి ఉప కులపతి భాగ్యనారాయణ, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేశారు. అప్పటి నుంచి దాదాపు పదేళ్ళు కావస్తున్నా మళ్లీ కొత్తగా నియామకాలు జరగలేదు.
పాలమూరు వర్సిటి తో పాటు అనుబంధంగా ఉన్న జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలోని పీజీ సెంటర్లలో కూడా ఆచార్యుల పోస్టులను కూడా భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయంలో మొత్తం 17 విభాగాల్లో 19 కోర్సులు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఒక ఆచార్యుడు విధిగా ఉండాలనే నిబంధన ఉంది. ఇక నియామకాలు లేక బోధన, పరిశోధన, పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు అంటున్నారు.




