హుజూర్‌నగర్ లో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాసం చివరి సోమవారం పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి

S. Srikanth
Updated on: 25 Nov 2019 10:50 AM IST
హుజూర్‌నగర్ లో  భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
X
క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు

హుజూర్ నగర్: నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాసం చివరి సోమవారం పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు శివాలయాల్లో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో వచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.

S. Srikanth

S. Srikanth

Next Story