యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి

యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి
x
Highlights

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఓ యువతి పై దాడి చేశాడు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి...

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఓ యువతి పై దాడి చేశాడు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసిందని తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్‌ కుటుంబం కూడా ఉంటుంది. అక్కడికి కారులో వచ్చిన వేణుగోపాల్‌ కుమార్తె అడ్డంగా ఉన్న కార్పొరేటర్‌ కారు తీయాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది దాడి చేసేంతగా పెరిగింది. వేణుగోపాల్‌ రెండో కుమార్తె (20) వీడియో తీస్తుండగా కార్పొరేటర్‌ ఆమెపై దాడి చేశాడని వేణుగోపాల్‌ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్య పదజాలంతో గొడవను పెద్దది చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలో కార్పొరేటర్‌ను వివరణ కోరగా.. తాను బనియను, షార్ట్‌ మీద ఉండగా ఎందుకు వీడియో తీస్తున్నావని వారించానని, దాడి చేయలేదని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories