యువతిపై దాడి: కార్పొరేటర్‌ అరెస్ట్‌

యువతిపై దాడి: కార్పొరేటర్‌ అరెస్ట్‌
x
Highlights

యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ ను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. చందానగర్‌ పోలీస్‌...

యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ ను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-2, నల్లగండ్ల విల్లా నంబర్‌-43లో శేరిలింగంపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ కుటుంబం నివాసముంటోంది. అదే లక్ష్మీవిహార్‌లోని విల్లా నంబర్‌-18లో బాధితురాలి కుటుంబం నివాసముంటోంది. ఈ నెల 12న రాత్రి 10.30 గంటలకు పార్కింగ్‌ విషయంలో ఆ యువతికి, కార్పొరేటర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కార్పొరేటర్‌ అసభ్యకరంగా మాట్లాడుతున్న విషయాలన్నీ బాధితురాలి సోదరి సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తోంది. క్షణికావేశానికి లోనైన కార్పొరేటర్‌ ఆ యువతిపై చేయిచేసుకున్నాడు. మహిళ బంధువులు వీడియో తీసి చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాగేందర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బేయిల్ రావడంతో నిందితుడు విడుదలయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories