వికారాబాద్ జిల్లాలో వెండి నాణాలు స్వాధీనం

admin1
Updated on: 1 Nov 2019 8:53 PM IST
వికారాబాద్ జిల్లాలో వెండి నాణాలు స్వాధీనం
X

వికారాబాద్ జిల్లాలో వెండి నాణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతతాండూరులో పురాతన ఇల్లు తవ్వుతుండగా వెండినాణాలు బయటపడినట్లు గుర్తించారు. మూడేళ్ల క్రితం నారా నరేందర్ తన ఇంటిని కయ్యూం, మోయిస్ అనే వ్యక్తులకు విక్రయించాడు. జేసీబీతో ఇంటిని కూల్చివేస్తుండగా బయటపడిన నాణాలు పంచుకుంటుండగా విషయం బయటకు పొక్కింది. వెండి నాణాలతో పాటు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 669 వెండినాణాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

admin1

admin1

Next Story