Seethakka: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్ఠీలు తోడు దొంగల నాటకం ఆడుతున్నారు

Seethakka: ప్రతిపక్ష నాయకులను భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకుంటుంది

Jyothi
Published on: 12 April 2024 8:21 AM IST
Seethakka Fire On BRS And BJP
X

Seethakka: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్ఠీలు తోడు దొంగల నాటకం ఆడుతున్నారు

Seethakka: బీజేపీ, బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం రెండు పార్టీలు కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్ఠీలు తోడు దొంగల నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని సీతక్క అన్నారు. ప్రజలు రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాలరాం నాయక్‌ పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story