హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ వద్ద మరోసారి భద్రతా తనిఖీలు

Hyderabad: ఇటీవల పట్టుబడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయం పేరు, నిఘావర్గాల హెచ్చరికలతో బీజేపీ ఆఫీస్‌లో భద్రత తనిఖీలు నిర్వహించిన పోలీసులు.

Sriveni Erugu
Updated on: 11 Feb 2022 1:51 PM IST
Security Checks Again at BJP Office in Hyderabad
X

హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ వద్ద మరోసారి భద్రతా తనిఖీలు

Hyderabad: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ వద్ద మరోసారి భద్రతా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయం పేరు ఉన్నట్లు గుర్తించారు. నిఘావర్గాల హెచ్చరికలతో బీజేపీ ఆఫీస్‌లో భద్రత తనిఖీలు నిర్వహించారు పోలీసులు. యూపీలో ఎంపీ అసదుద్దీన్‌ ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కార్యాలయానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అంటున్నారు బీజేపీ శ్రేణులు. అయితే భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో పోలీసు ఉన్నతాధికారుల సమావేశమయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story