Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 14 Jan 2026 2:00 PM IST
Secunderabad Fire Accident
X

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటల తీవ్రతకు గోదాంలో ఉన్న అగ్ని నివారణ పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story