Bhuma AkhilaPriya Bail Petition: భూమా అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు

తెలంగాణలో కలకలం రేపిన బోయిన్‌పల్లి కేసు కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మరోసారి షాక్ తగిలింది.

Samba Siva Rao
Published on: 18 Jan 2021 3:46 PM IST
Bhuma AkhilaPriya Bail Petition:  భూమా అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు
X

భూమా అఖిలప్రియ ఫైల్ ఫోటో

తెలంగాణలో కలకలం రేపిన బోయిన్‌పల్లి కేసు కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బిగ్ షాక్ తగిలింది. సికింద్రాబాద్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతోందని, బెయిల్ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా కోర్గును కోరారు. అంతేకాదు ఆమెపై అదనపు సెక్షన్లు నమోదు చేసి మెమో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అఖిలప్రియకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం బెయిల్ పిటిషన్‌ను తిప్పి పంపింది.

ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ బెయిల్‌ కోసం నాంపల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంతకు ముందు కూడా బెయిల్‌ కోసం అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే నిందితును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వాదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టుకు ఆమెకు బెయిల్ నిరాకరించింది. అనంతరం మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు.. తాజాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story