Nagarkurnool: స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్‌.. ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం శివారులో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Nov 2024 11:59 AM IST
School Bus Overturns In Nagarkurnool District
X

Nagarkurnool: స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్‌.. ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం శివారులో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బిజినేపల్లి మేధాన్ష్ ప్రైవేట్ పాఠశాల బస్సును వట్టెం గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో స్కూల్ బస్ బోల్తా పడింది. దీంతో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి.

ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్లే వాహనదారులు అప్రమత్తమై చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆరుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story