Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం

Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 6 Dec 2025 12:16 PM IST
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం
X

Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం

Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్‌ అభ్యర్థి జాడి దర్శనను బెదరిస్తూ దళం పేరిట లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారని బాధితుడి మామ ఫిర్యాదు పోలీసులను ఆశ్రయించాడు. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి.. తుపాకీతో బెదిరించినట్టు బాధితుడు కంప్లయింట్ ఇచ్చాడు. రణవెల్లిలో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించినట్టు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ కూడా ఇచ్చినట్టు బాధితుడు స్పష్టం చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story