Hyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం

Hyderabad: నిందితుల కాల్‌డేటా.. రికార్డింగ్స్ సేకరించిన పోలీసులు

Rama Rao
Updated on: 17 May 2022 1:08 PM IST
Saroornagar Murder Case Updates | Telangana News
X

Hyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం

Hyderabad: సరూర్ నగర్‌లో పరువు హత్యకేసులో ఇద్దరే హత్యకేసులో కీలక పాత్రపోషించారని పోలీసులు గుర్తించారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కేస్ స్టడీతోపాటు కస్టడీ కన్ఫర్మేషన్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరచారు. నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుల కాల్ డేటా, రికార్డింగ్స్ సేకరించిన పోలీసులు విశ్లేషించారు. నాగరాజు ఆచూకీ తెలుసుకున్న మసూద్, తన స్నేహితుడితో కలిసి కడతేర్చాడని పోలీసులు నివేదిక రూపొందించారు.

హత్యకేసులో నిందితుడు మసూద్ తన మొబైల్‌లో ఈ మెయిల్ ఐడీకి తన మొబైల్ నంబరునే పాస్ వర్డ్‌గా సెట్ చేసుకున్నాడు. అదే తరహాలో నాగరాజు మొబైల్‌ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయత్నించాడు. హత్యజరిగిన రోజు నిందితులు కుటుంబ సభ్యులతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదని పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరికీ ఇతర సంస్థలతో ఎలాంటి సంబంధాల్లేవని నివేదికలో పేర్కొన్నారు. కస్టడీ ముగిసన తర్వాత నిందితుల్ని కోర్టులో హాజరు పరిచారు.


Rama Rao

Rama Rao

Next Story