Medak: రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను తొలగించి మొరం తరలిస్తున్న మాఫియా
Medak: రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదంటున్న స్థానికులు
Medak: రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను తొలగించి మొరం తరలిస్తున్న మాఫియా
Medak: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లను కాలనీ వాసులు అడ్డుకున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా తరలించడమే కాకుండా రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్లను సైతం తొలగించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్టర్ భూమికి రోడ్డు నిర్మాణం కోసం మొరం తరలిస్తున్నారని గ్రామస్తులంటున్నారు. గ్రామ శివారులోని పాలకుంట చెరువులో నుంచి మొరం తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెర్వో కి ఫోన్ చేసినా స్పందించడంలేదంటున్నారు.
Next Story




