హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతుల అలంకరణ

Sadar Festival 2021: డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న యువత...

Shireesha
Published on: 6 Nov 2021 8:46 AM IST
Sadar Festival 2021 Celebrations Going on in Hyderabad | Telugu Online News
X

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతుల అలంకరణ

Sadar Festival 2021: హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు నిలుస్తున్నాయి. ఈ వేడుకల్లో దున్నపోతులను ప్రత్యేకంగా ఆలంకరించడం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. యాదవులు ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ, సైదాబాద్, ఖైరతాబాద్, కాచిగూడ, ఓల్డ్ సిటీ మరికొన్ని ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరగుతున్నాయి.

సైదాబాద్‌లో దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించారు. జీవనోపాధి కల్పిస్తున్న మూగజీవుల పట్ల యాదవులు తమ భక్తిని చాటుకుంటున్నారు. ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెట్టారు. వాటిని అలంకరించి ఊరేగించారు. వీటి వెనుక యువత డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతియేటా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల్లో నారాయణగూడలో నిర్వహించే సంబురాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇక సైదాబాద్‌లో జరిగిన ఉత్సవాల్లో కుర్మగూడకు చెందిన మనోజ్ యాదవ్, చౌని.. ఉపేరుగుడాకు చెందిన మనీష్ యాదవ్ దున్నపోతులు ఆకర్షణగా నిలిచాయి.

Shireesha

Shireesha

Next Story