TSRTC: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు..

RTC Workers As Government Employees
x

 TSRTC: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. 

Highlights

TSRTC: ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం

TSRTC: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీకి మంచిరోజులు వచ్చాయి. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనానికి అడుగులు పడ్డాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విలీన నిర్ణయం ఆర్టీసీ వర్గాల్లో పండుగవాతావరణం నెలకొంది.

నిర్వీర్యమైన ఆర్టీసీలో నెలవారీ వేతనాలు చేతికందే పరిస్థితి కాదుకదా... యూనిఫారం దుస్తులు ఇవ్వలేని దయనీయ స్థితికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ సంస్థలో పనిచేసే 40 వేలమంది ఉద్యోగులు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ మంత్రి వర్గ నిర్ణయాన్ని ప్రకటించారు. 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన లాంఛనలాలను సిద్ధంచేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారనే శుభవార్తను మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43వేల 373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందబోతున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీన బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీ సంస్థను గాడిలో పెట్టకపోయినా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనాంశం సంతోషదాయకమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories