యూనియన్ల మాటలు పక్కన పెట్టి, విధుల్లో చేరాలన్న పీవీ కృష్ణయ్య

యూనియన్ల మాటలు పక్కన పెట్టి, విధుల్లో చేరాలన్న పీవీ కృష్ణయ్య
x
Highlights

హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల తరుపు న్యాయవాది పీవీ కృష్ణయ్యపై.. ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ కృష్ణయ్య, వెంటనే తన మాటలను వెనక్కి...

హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల తరుపు న్యాయవాది పీవీ కృష్ణయ్యపై.. ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ కృష్ణయ్య, వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ల మాటలను పక్కన పెట్టి, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని పీవీ కృష్ణయ్య అన్నారు. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరకపోతే.. ఉద్యోగాల నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని తెలిపారు. అయితే, ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే.. సమ్మె విరమించమని పీవీ కృష్ణయ్య ఎలా అంటారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు వద్ద పీవీ కృష్ణయ్యను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, న్యాయవాదుల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories