ఆర్టీసీ జేఏసీ నిరాహారదీక్ష వాయిదా..
ashwathama reddy
ఆర్టీసీ జేఏసీ మంగళవారం తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున నిరాహార దీక్ష వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమన్న ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించిందన్నారు. చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో గాయపడిన మహిళలను గవర్నర్ దగ్గరకు తీసువెళతామని.. ఇందు కోసం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని చెప్పారు. రేపటి హైకోర్టు విచారణ తర్వాత తదుపరి కార్యాచరణపై స్పందిస్తామన్నారు.
Next Story




