ఛలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతాం-అశ్వద్దామరెడ్డి

admin1
Updated on: 9 Nov 2019 10:51 AM IST
ఛలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతాం-అశ్వద్దామరెడ్డి
X

ఛలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా, పెద్దఎత్తున తరలివచ్చి... కార్మికుల ఐక్యతను చాటాలని అశ్వద్ధామరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డ అశ్వద్ధామరెడ్డి కార్మికుల ఇళ్లల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఫైరయ్యారు. మహిళలని చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా, నిర్బంధించినా.... ట్యాంక్‌బండ్‌పై జకల జనుల సామూహిక దీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు.

admin1

admin1

Next Story