Minister Gangula: బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ

Minister Gangula: చేతి వృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకే బీసీలకు లక్ష సహాయం పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి గంగుల.

Arun Chilukuri
Updated on: 17 Jun 2023 6:00 PM IST
Rs 1 lakh Aid to BCs is a Continuous Process Says Gangula Kamalakar
X

Minister Gangula: బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ

Minister Gangula: చేతి వృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకే బీసీలకు లక్ష సహాయం పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి గంగుల. సచివాలయంలో మంత్రి గంగుల అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ పాల్గొన్నారు. బీసీలకు లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని గంగుల తెలిపారు. ఇప్పటి వరకు..2 లక్షల 70 వేల దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదయ్యాయని వెల్లడించారు. ఇక ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు మంత్రి గంగుల.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story