Hyderabad: హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు...

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది.

Arun Chilukuri
Updated on: 28 Jan 2023 6:30 PM IST
Road Sinks In Himayat Nagar Hyderabad
X

Hyderabad: హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు...

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గోశామహల్‌ చక్నవాడి ఘటన మరువకముందే.. హిమాయత్‌నగర్‌లో రోడ్డు కుంగింది. స్ట్రీట్‌ నంబర్‌ 5 లో రోడ్డుపై 10 అడుగుల మేర గుంత ఏర్పడింది. అయితే.. ఈ గుంతలో మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు టిప్పర్‌ను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story